నందాదేవి పర్వతాన్ని అధిరోహిస్తూ చనిపోయిన వాళ్లు తీసుకున్న చివరి వీడియో ఇదే..!

-

వీళ్ల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెస్క్యూ టీంకు ఈ బృందంలోని ఏడుగురి మృతదేహాలు దొరికాయి. కానీ.. ఆ బృందంలోని బ్రిటన్ కు చెందిన గైడ్ మార్టిన్ ఆచూకీ మాత్రం తెలియలేదు.

నందాదేవి… భారతదేశంలో ఉన్న హిమాలయాల్లోని రెండో అది పెద్ద పర్వతం. దీన్ని అధిరోహించడం కాస్త కష్టమే. అయినప్పటికీ.. దీన్ని చాలా మంది పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. విదేశీయులు కూడా చాలామంది దీన్ని ఎక్కడానికి ఆసక్తి చూపుతుంటారు.

అలా.. మే 13న ఓ ఇండియన్ గైడ్, నలుగురు బ్రిటన్ వ్యక్తులు, ఇద్దరు యూఎస్ వ్యక్తులు, ఒక ఆస్ట్రేలియన్.. దీన్ని అధిరోహించడానికి వెళ్లారు. ఓ తాడు సాయంతో వాళ్లు దాన్న అధిరోహిస్తున్నారు. అయితే.. మే 26న వీళ్లతో సంబంధాలు తెగిపోయాయి.

తర్వాత వీళ్ల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెస్క్యూ టీంకు ఈ బృందంలోని ఏడుగురి మృతదేహాలు దొరికాయి. కానీ.. ఆ బృందంలోని బ్రిటన్ కు చెందిన గైడ్ మార్టిన్ ఆచూకీ మాత్రం తెలియలేదు.

ఏడుగురి మృతదేహాలను వెలికి తీస్తున్న సమయంలోనే వాళ్లకు ఓ కెమెరా దొరికింది. ఆ కెమెరా మంచులో కప్పుకొని ఉంది. ఆ కెమెరాలో 1.55 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఉంది. ఆ వీడియోను ఐటీబీపీ అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోలో ఈ పర్వతారోహకుల బృందం నందాదేవిని ఎక్కుతుండగా తీసుకున్న విజువల్స్ ఉన్నాయి. అంటే వాళ్లు తీసుకున్న చివరి వీడియో అది.

వీళ్లు పర్వతాన్ని అధిరోహిస్తుండగా… బరువు కారణంగా వాళ్లు ఎక్కుతున్న మంచుకొండ విరిగిపోయి వాళ్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. వీడియో చివర్లో కూడా పెద్ద శబ్దం రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత వీడియో చిత్రీకరణ ఆగిపోతుంది. ఆ శబ్దం మంచుచరియలు విరిగిపడటమే అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news