దారుణం : ఒక్క దెబ్బతో కన్న తల్లిని చంపిన దుర్మార్గుడు.. సీసీ ఫుటేజ్ లభ్యం !

-

ఢిల్లీలోని ద్వారకా మోర్ పరిసరాల్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంటి బయట కొడుకు చేత చెంపదెబ్బ తిన్న మహిళ అక్కడిక్కడే పడి చనిపోవడం సంచలనంగా మారింది. ఈ సంఘటన అంతా ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పోలీసుల వివరాల ప్రకారం, మధ్యాహ్నం 12:07 గంటలకు, బిందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సేవాక్ పార్క్ నివాసి అయిన శూద్ర బిష్ట్ నుండి పిసిఆర్ కాల్ వచ్చింది. తమ ప్రాంతంలోని వాహనాల పార్కింగ్‌కు సంబంధించి ఒక గొడవ జరుగుతుందని  బిష్ట్ సమాచారం ఇచ్చారు.

దీంతో ఒక పోలీసు అధికారి సంఘటన స్థలానికి చేరుకున్నారు, కానీ ఈ గొడవ క్లియర్ అయిందని సమాచారం ఇచ్చారు. వాహనాల పార్కింగ్‌కు సంబంధించి భవనం యజమానితో కొంత వాగ్వాదం జరిగిందని అయితే వాగ్వాదం ముగిసిందని అన్నారు. అయితే దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడు రణబీర్ మరియు అతని భార్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగడం రికార్డ్ అయి ఉంది. ఈ గొడవ జరిగిన సమయంలో, రణబీర్ కోపంతో తన వృద్ధ తల్లిని బలంగా ఒక్క చెంపదెబ్బ కొట్టాడు, దీనివల్ల ఆమె నేల మీద పడిపోయింది. తర్వాత, ఆమెను ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. అలా ఒక కేసు గురించి సీసీ ఫుటేజ్ చూస్తే ఇలా మరో కేసు బయట పడింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version