భారీగా ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు అత్య‌ల్పం గా ఎంతంటే?

-

గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రా ల‌లో ఉష్ణోగ్ర‌తలు భారీగా ప‌డిపోతున్నాయి. చ‌లీ తీవ్ర‌త విప‌రీతం గా పెరుగుతుంది. ప్ర‌జలు త‌ట్టుకొని విధం గా అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. తాజా గా తెలంగాణ‌లో అసిఫాబాద్ జిల్లా లో అత్య‌ల్పం గా 10.4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయింది. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో గల విశాఖ జిల్లా లంబ‌సింగి లో అత్య‌ల్పం గా 10 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయింది. కాగ మ‌రి కొన్ని రోజులు ఉష్ణోగ్ర‌త‌లు భారీ గా ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

ముఖ్యం గా మరో రెండు రోజుల పాటు 8 నుంచి10 డిగ్రీల లోపే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని రెండు రాష్ట్రాల వతావర‌ణ అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతం నుంచి కింది భాగానికి చ‌ల్ల‌టి గాలులు రావ‌డం తో నే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అవుతున్నాయ‌ని వతావ‌ర‌ణ అధికారులు తెలిపారు. అలాగే ఉద‌యం స‌మ‌యం లో పొగ మంచు కూడా విప‌రీతం గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version