ఆక్రమణ వల్లనే ఖమ్మంలో భారీ వరదలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

ఆక్రమణ వల్లనే ఖమ్మంలో భారీ వరదలు సంభవించాయని  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి సూర్యపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి పరామర్షిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహబూబాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఖమ్మంలో ఆక్రమించిన స్థలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆసుపత్రి నిర్మించారు. పువ్వాడ ఆక్రమణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  పువ్వాడ ఆసుపత్రిని తొలగించాలని హరీశ్ రావు అడగాలని పేర్కొన్నారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 42 సెం.మీ. వర్షం పడింది. ప్రభుత్వ ముందు చూపు వల్లనే నష్టం పెద్దగా జరుగలేదు. వరదలకు నష్టపోయిన వారిని తప్పకుండా ఆదుకుంటాం అన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం అందజేస్తామిన సీఎం రేవంత్  రెడ్డి వెల్లడించారు. యువ శాస్త్రవేత్త అశ్విని మరణం చాలా బాధకరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version