పొద్దున్నపూట గింజలతో రోజును మొదలు పెడితే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకోండి.

-

పొద్దున్న మీరు తీసుకునే ఆహారమే మీ రోజుని నిర్ణయిస్తుంది. ఇలా చెబితే చాలామంది నమ్మరు. కానీ ఇది నిజం. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారమే మీ మూడ్ ని శాసిస్తుంది. అందువల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిమీద కొంత ఆలోచన ఉండాలి. ఫైబర్ కలిగి ఉన్న గింజలను పొద్దున్నపూట తీసుకోవడం ఎంతో లాభదాయకం. గింజలను తొలి ఆహారంగా తీసుకోవడం వల్ల కొత్త ఎనర్జీ వచ్చినట్లు అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కువ సేపు నిలబడుతుంది కూడా.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నిద్రలోంచి లేచిన తర్వాత తీసుకునే మొదటి ఆహారం తేలికగా ఉండడం ఉత్తమం. ప్లేట్ నిండా అధిక కేలరీలున్న వాటిని పక్కకు పెట్టండి.

నానబెట్టిన బాదం, వాల్ నట్స్ మంచి ఫలితాన్నిస్తాయని నిపుణుల అభిప్రాయం.

ఎందుకంటే?

బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్- ఈ అధికంగా ఉంటాయి. నానబెట్టిన బాదం గింజలను పొద్దున్న పూట తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. కొవ్వు తగ్గుతుంది. ఐతే నానబెట్టిన బాదాంలను పొట్టు తీసేసి తినడం మర్చిపోవద్దు.

నానబెట్టిన వాల్ నట్స్ లో ప్రోటీన్, మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ లో కాపర్, పొటాషియం, జింక్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.

నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గుతారు. శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version