వెదర్‌ అప్డేట్‌ : మూడు రోజలు అతి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

-

తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అయితే.. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు కేంద్రీకృతమవుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. తాజాగా వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపింది. తూర్పు-పశ్చిమ షియర్‌ జోన్‌ సుమారుగా 15N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 -4.5 కి.మీ మధ్య స్థిరంగా కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాలుగు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.

ఇక భాగ్యనగరంలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం పూట పొగ మంచు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, కనిష్టం 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version