హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌ జారీ

-

హైదరాబాద్‌లు పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వాన పడుతున్నది. హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్‌, కోఠి, చార్మినార్‌, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అసిఫ్‌నగర్‌, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ప్యాట్నీ, పారడైజ్‌, బేగంపేట, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌ బంజారాహిల్స్‌తో పాటు పలు చోట్ల వర్షం కురుస్తున్నది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనారులు ఇబ్బందులకు గురయ్యారు. పొద్దంతా నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

ఈ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు,ఉరుములతో కూడిన భారీ వర్షం పడనుందని తెలిపింది.దాదాపు గంట నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, ఖైరతాబాద్, లక్డికాపూల్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, కోఠి, బషీర్ నగర్, సుల్తానా బజార్, బేగంబజార్, అఫ్జల్ గంజ్ పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు మరో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వనపర్తి, జనగామ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడా ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version