ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు మరింత విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది..బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది..తీవ్ర వాయుగుండం కోస్తా జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై ఎక్కువ తీవ్రత ఉంటుందని అంచనా వేసింది..కోస్తా, రాయలసీమ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి..కోస్తా తీరంలో గంటకు 45నుంచి 65కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు..కోతకు వచ్చిన పంట వర్షాలతో నష్టపోవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరో వైపు బంగాళాఖాతంలో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఏపీకి భారీ వర్ష సూచన..కోస్తా, రాయలసీమ జిల్లాలకు రెడ్, ఆరెంజ్,ఎల్లో హెచ్చరికలు.
-