భారీ వర్షం.. నిండుకున్న హుస్సేన్ సాగర్

-

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని హుస్సేన్‌ సాగర్‌కు భారీ ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. హుస్సేన్ సాగర్‌లో ప్రస్తుత నీటి మట్టం 513.51 మీటర్లకు చేరినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) కెపాసిటీ 513.41 మీటర్లు కాగా, దానికి వ్యతిరేకంగా 513.51 మీటర్ల నీరు చేరడంతో సాగర్ మొత్తం నిండుకుండలా మారింది.

దీంతో జీహెచ్ఎంసీ మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సాగర్ తూముగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరదనీటి కాలువల ద్వారా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version