బ్రేకింగ్‌ : హైదరాబాద్‌లో భారీ వర్షం..

-

హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని.. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. వరద తాకిడికి పార్కింగ్​ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి.

ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అయితే భానుడి భగభగకు చెమటలు కక్కుతున్న హైదరాబాద్‌ వాసులకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version