Breaking: ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి

-

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 46 ఏళ్లు ఉన్న ఆండ్రూ సైమండ్స్‌.. టౌన్స్‌ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి తో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఇటీవలే దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆసీస్‌ మరో దిగ్గజ ఆటగాడు, ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మరణించడంతో.. క్రికెట్‌ అభిమానులను శోకసంద్రంలో ముంచింది.కాగా… మార్చి 4న గుండెపోటుతో అతని మాజీ సహచరుడు షేన్ వార్న్ మరణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version