దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వార్నింగ్ ఇచ్చింది. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ మరియు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది.

ఇటు తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని హనుమకొండ, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, వర్గల్, భువనగిరి జిల్లాల్లో ఈరోజు నుంచి మరో వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.