ప్రకాశం బ్యారేజి కి భారీగా వరద నీరు చేరుతుంది. 60 గేట్లు అడుగు మేర ఎత్తారు అధికారులు. వరద ప్రవాహాన్ని బట్టి మధ్యాహ్నం కి 60 నుండి 70 గేట్లు ఎత్తుతామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి కి ఇన్ ఫ్లో 77 వేల క్యూసెక్కులు ఉందని అన్నారు. ఔట్ ఫ్లో 44,000 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. తాగు సాగు నీరు కోసం 11,000 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసారు.
రెండు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంటున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు. రాత్రి కి 60వేలు క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు నుంచి వరద నీరు వస్తుందని గుర్తించారు. ఇప్పుడొస్తున్న వరద నీరంతా ప్రకాశం బ్యారేజి క్యాచ్ మెంట్ ఏరియాలోదే అని అన్నారు. ఈ రాత్రికి అప్రమత్తంగా ఉండాలని, వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.