గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగరవాసులు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక భారీ వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్న నేపథ్యంలో వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ అధికారులతో సమావేశం అయ్యారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అందరూ తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు మంత్రి కేటీఆర్. రాబోయే రెండు వారాల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, వివిధ మరమ్మతు పనులను చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అంతేకాకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు వారాల పాటు మున్సిపల్ అధికారులు అందరికీ సెలవులు రద్దు చేయాలి అంటూ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు కేటిఆర్.