అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు.. ఎందుకు తెలుసా..!

-

కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై భారీగా పడిన విషయం తెలిసిందే. ఇప్పడికి కూడా పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకోలేరు. విద్యా సంస్థలు తేరుచుకునేందుకు సిద్ధమవుతున్నప్పటికీ చిన్నారులకు సంబంధించిన అంగన్వాడీల గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశంలోని 14 లక్షల అంగన్వాడీలు తెరుచుకోకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఇటీవలే ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం… పిటిషనర్ యొక్క వాదనతో ఏకీభవించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలి అంటూ తెలిపింది. అయితే సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందడంతో అంగన్వాడీల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version