సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు పోలీసులు.
ఈ నేపథ్యంలోనే చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. హీరో అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈక్రమంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు బందో బస్తును చేపట్టారు. దీంతో అల్లు అర్జున్ ను రిమాండ్ విధించనున్నట్టు స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ కి జైలా..? బెయిలా..? అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.