ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో వరుసగా ఐదు రోజులపాటు భారి నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కరీంనగర్ మహబూబాబాద్ మహబూబ్నగర్ నల్గొండ తదితర జిల్లాలలో… వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.