పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందుల, ఒంటిమిట్ట రెండు చోట్ల బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు.

పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.