ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. గత వారం రోజులుగా సైలెంట్ అయిన వర్షాలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి వినాయక చవితి సందర్భంగా వర్షాలు విపరీతంగా కొడతాయి అన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈసారి మళ్లీ వర్షాలు ప్రారంభం కాలు ఉన్నాయి. బంగాళాఖాతం పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ ఆల్బమ్ కారణం ఇవాళ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం అల్లూరి కాకినాడ లో అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా సూచనలు చేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.