బొసిపోయిన హైదరాబాద్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..!

-

హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు మంగళవారం రాత్రి నుంచే బయలు దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచే హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు హైవేపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి.

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. పండుగకు ముందు రెండుమూడు రోజులు, పండుగ తర్వాత రెండు మూడు రోజులు హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అన్న సమస్యే ఉండదు. కానీ.. ఎందుకు అలా అంటే.. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు అంతా పండుగ కోసం తమ ఊళ్లకు పయనం అవుతారు కాబట్టి.

ఇప్పుడు కూడా హైదరాబాద్ లో అటువంటి పరిస్థితే నెలకొన్నది. కానీ.. ఇప్పుడేమీ పండుగ లేదు కదా అంటారా? అయ్యో.. ఓట్ల పండుగ ఉన్నది కదా. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగనున్నాయి కదా. అందుకే… హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు అందరూ మళ్లీ తమ ఇళ్లకు పయనమయ్యారు.

దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఫుల్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు మంగళవారం రాత్రి నుంచే బయలు దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచే హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు హైవేపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి.

టోల్ గేట్ దగ్గర రుసుం వసూలు చేయడం లేట్ అవుతుండటంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో కాలు పెట్టే సందులేదు. బస్సుల్లోనూ అదే పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి తమ సొంతురుకు వెళ్లి ఓటేయాలనుకునే వాళ్లకు ప్రయాణం నరకంలా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version