తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డివిజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీన సాధిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు.
చర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధాని మోడీకి సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రానికి డ్రైపోర్టు ఇవ్వాలని మోడీని కోరారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సైతం సహకారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, కాసేపటి కిందట ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా తెలంగాణలోని చెర్లపల్లి కొత్త టెర్మినల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.