షాకింగ్ : పరువు హత్యకు గురయిన హేమంత్ సినిమా హీరోనా ?

-

ఈరోజు పరువు హత్యకు గురయిన హేమంత్ కి సంబంధించి ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే హేమంత్ కొన్నేళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోగా నటించాడు. విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్ మీద నాగరాజు కొట్టే నిర్మించిన ఆ సినిమా పేరు అందమైన మాయ. మణీంద్రన్ అనే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015 లో జరిగింది. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ ను అప్పుడు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అప్పుడు మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్‌లు విడుదల చేశారు.

కార్తీక్, భవ్యశ్రీ, చిరు సాయి, శృతి, హేమంత్ లు ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి సత్య సోమేష్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ జై సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఈయన్ని మద్యం సేవించి మత్తులో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాడుతో మెడకు బిగించి హేమంత్ ను నిందితులు హత్య చేసినట్టు గుర్తించారు. నిన్న రాత్రి 7:30కే హత్యచేసి సంగారెడ్డి మల్కాపూర్ లో నిందితులు పడేసినట్టు గుర్తించారు. గోపన్ పల్లికి వెళ్ళాక కారులో నుండి దింపి మరోకారులో ఎక్కించిన యుగేంధర్ రెడ్డి, ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి తరలించాడని, తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version