నొకియా నుంచి.. రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు నోకియా G21, G11 మంగళవారం లాంఛ్ అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లే నయా ట్రెండ్ అయింది. కస్టమర్స్ ఈ కెటగిరీ ఫోన్లకే ఎక్కువ మొగ్గు చూపడంతో.. కంపెనీలు కూడా.. తక్కువ బడ్జెట్ లో బోలెడన్నీ ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి.
Nokia G21 స్పెసిఫికేషన్స్
Nokia G21.. Nokia G20కి సక్సెసర్‌గా లాంచ్ అయింది. ఇది ఫ్రంట్ కెమెరా కోసం పైన వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.5-అంగుళాల IPS LCDని కలిగి ఉంటుంది.
డిస్ప్లే HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.
90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది.
Nokia G21 Unisoc T606 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో నడుస్తుంది. కనెక్టివిటీ వారీగా ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్, 4G VoLTE, బ్లూటూత్, GPS, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వైఫై మొదలైనవి ఉంటాయి.
ఇది గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
USB టైప్-సి ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5050 mAh బ్యాటరీతో వస్తుంది.
బ్యాక్ సైడ్ G21 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50MP ప్రధాన కెమెరాతో అనుసందానమై ఉంటుంది. సెల్ఫీల కోసం పరికరంలో 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Nokia G11 హైలెట్స్..
G11 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.5-అంగుళాల HD+ IPS LCDని కలిగి ఉంది.
ఇది అదే Unisoc T606 SoCతో వస్తుంది. అయితే ఫోన్ 3GB, 4GB RAMతో పాటు 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
వెనుక భాగంలో.. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 13MP ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2MP సెన్సార్లతో వస్తుంది. సెల్ఫీలు వీడుయోల కోసం.. ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
G21లానే.., G11 5050 mAh బ్యాటరీ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌తో నడుస్తుంది.