విడాకులు తీసుకోనున్న రాజీవ్ కనకాల- సుమ.. క్లారిటీ ఇదే !?

-

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె..త్వరలో వెండితెరపైన సినీ ప్రేక్షకులను పలకరించనుంది. జనాలను ఇన్నాళ్లు బుల్లితెరపైన ఎంటర్ టైన్ చేసిన..సుమ సిల్వర్ స్క్రీన్ పైన ‘జయమ్మ’గా మెరవనుంది.

ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి రాజీవ్ కనకాల, యాంకర్ సుమ విడాకులు తీసుకుంటున్నారని అని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా యాంకర్ సుమ తన స్టైల్లో స్పందించింది. ఓ ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ సుమ ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన వైవాహిక జీవితం లో జరిగిన సంఘటనలను షేర్ చేసుకుంది.

భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణమని… తమ మధ్య కూడా గొడవలు జరిగాయని తెలిపింది. ఇక విడాకుల విషయానికి వస్తే.. విడాకులు తీసుకోవడం అనే ఇది చాలా కామన్.. కానీ ఒక తల్లిదండ్రులుగా ఇది చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు సుమ. ప్రస్తుతం సినిమా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు విడాకులు తీసుకునేందుకు తమ పిల్లలే అండగా ఉన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version