వావ్‌.. అదిరింది.. హీరో అజిత్‌కు షూటింగ్‌ పోటీల్లో 4స్వర్ణాలు

-

హీరో అజిత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. దక్షిణాది స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా డైనమిక్ గానే ఉంటారు. అజిత్‌ ప్రతిభావంతుడైన బైక్ రైసర్ అని అందరికీ తెలిసిందే. తాజాగా గన్‌ షూటింగ్ పోటీల్లోనూ తన ప్రావీణ్యం ప్రదర్శించారు అజిత్.

 

ఏదో అందరిలా ప్రాతినిధ్యం వహించడం కాదు, ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు అజిత్. ప్రస్తుతం తిరుచ్చిలో 47వ రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ జరుగుతోంది. ఇందులో అజిత్ టీమ్ కూడా పాల్గొంది. ఇందులో సీఎఫ్ పీ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్, 50 మీటర్ల ఎఫ్ పీ మాస్టర్ విభాగాల్లో అజిత్ అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో మరో రెండు కాంస్యాలు కూడా అజిత్ వశమయ్యాయి. అజిత్ గతేడాది చెన్నైలోనూ షూటింగ్ పోటీల్లో సత్తా చాటాడు. ఏకంగా 6 పసిడి పతకాలు అందుకున్నాడు అజిత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version