చిన్నారి వ్యక్తిత్వాన్ని మెచ్చిన హీరో సైకిల్స్ ఛైర్మన్

-

జీవితాంతం ఏడాదికో సైకిల్ ని  అందిస్తామంటూ..హామీ

 

కేరళలో ముంచెత్తిన వరదల కారణంగా సర్వంకోల్పోయిన కుటుంబాలకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యలో తమిళనాడులోని విల్లు పురానికి చెందిన అనుప్రియ అనే చిన్నారి సైకిల్ కొనుక్కోడానికి పిగ్గీ బ్యంకుల్లో దాచుకున్న డబ్బుని వరద బాధితులకు విరాళంగా ఇచ్చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు ప్రముఖుల నుంచి మన్ననలు పొందింది.. వారిలో హీరో సైకిల్స్ ఛైర్మన్ కూడా ఉన్నారు.

చిన్నారి సాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఫిదా అయిన  చైర్మన్ పంకజ్ ఎం ముంజల్..  అనుప్రియకు కలగా మిగిలిన సైకిల్ని హీరో కంపెనీ ప్రతినిధులతో అందజేశారు. సంబంధిత ఫోటోని ట్విటర్లో పోస్ట్ చేసిన ఛైర్మన్ ప్రతి ఏడాది ఓ సైకిల్ ను ఇలాగే అందిస్తామన్నారు.. ‘అనుప్రియ థ్యాంక్స్..మీ అమ్మగారితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది..నీకు ఆ భగవంతుని దీవెనలు ఉంటాయి.. నువ్వు ఇలాంటి వ్యవక్తిత్వాన్ని జీవితాతం కలిగి ఉండాలని’  కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news