WWE సూపర్ స్టార్ జాన్సెనా తో హీరో కార్తీ !

-

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో జరగనున్న WWE సూపర్ స్టార్ స్పెక్ట కూలర్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ఇక ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 .30 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఈ ఈవెంట్ గురించి యాడ్స్ వేస్తున్నప్పటి నుండి రెస్లింగ్ ఎంతగానో ఇష్టపడే ఎంతోమంది అభిమానులు దీనిని ప్రత్యక్షముగా తిలకించడానికి ఎదురుచూస్తున్నారు. ఎక్కడో ఫారిన్ లో జరిగే ఈ ఈవెంట్స్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుండడం ఎందరికో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా WWE లో ఒక స్థాయిలో ఉన్న సూపర్ స్టార్ జాన్ సేనా రావడంతో అతనిని ప్రత్యేకంగా అభిమానించే ఎందరో ఈ ఈవెంట్ ను చూడడానికి వస్తున్నారు.

కాగా ఈ ఈవెంట్ కోసం తమిళ హీరో కార్తీ సైతం స్టార్ స్పోర్ట్స్ తరపున ఇక్కడకు విచ్చేయడం విశేషం. హీరో కార్తి జాన్ సేనా ను కలిసిన పోహోతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version