గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో రాజ్ తరుణ్

-

ఇటీవల గ్రీన్ ఇండియాలో భాగంగా సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ గచ్చిబౌలిలో మొక్కలు నాటిన సంగతి అందరికి తెలిసిన విషయమే.. అయితే విజయ్ మొక్కలు నాటి సీని హిరో రాజ్ తరుణ్ కి ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ ను సిరియస్ గా తీసుకున్న రాజ్ తరణ్ మొక్కలు నాటి చూపించాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం విధితమే.. ఇందులో భాగంగానే టాలివుడ్ హిరో రాజ్ తరుణ్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా హీరో రాజ్ తరణ్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ప్రారంభోత్సవానికి రాజ్యసభ సభ్యులు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గోని మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు పాటు పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ సినీ హీరోయిన్ హేమల్ ఏంగఏ , ఆర్టిస్ట్ మధునందన్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరాడు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు పాల్కొన సంగతి అందరికి తెలిసిందే

Read more RELATED
Recommended to you

Exit mobile version