అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు టీమిండియా మాజీ సారథి ధోనీ ప్రకటించడంపై హీరో రామ్ చరణ్ స్పందించారు. “మన బ్యాటింగ్ లైనప్‌కు స్థిరత్వం తీసుకువచ్చే సమర్థుడైన వికెట్ కీపర్ కోసం వేచిచూస్తున్న తరుణంలో నువ్వొచ్చావు. వచ్చావు, ఆడావు, భారత్ కోసం ప్రపంచాన్నే జయించావు. థాంక్యూ ఎంస్ డీ. నీవు గెలిపించిన మ్యాచ్‌లను, మెరుపువేగంతో చేసిన స్టంప్‌లను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం” అంటూ చరణ్ ట్వీట్ చేశారు.
When we were waiting for a competent wicket keeper to show up and bring stability to our line up, you came. You came,you played,you conquered the world for India. #ThankYouMSD. We will forever cherish the match winning innings' you played & the lightning stumpings you pulled off.
— Ram Charan (@AlwaysRamCharan) August 16, 2020
ఆ వెంటనే ఏ మాత్రం ఊహించని విధంగా ‘నీ దారిలోనే నడుస్తా’ అంటూ సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ దిగ్గజాల ఆకస్మిక నిర్ణయాలతో యావత్ క్రికెట్ ప్రపంచం కలవరపాటు గురి కాగా.. సహచర ఆటగాళ్లు సైతం షాక్‌కు గురయ్యారు. అలాగే దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు, అఖిల్, వెంకటేష్ కూడా ధోని రిటైర్‌మెంట్‌పై స్పందించారు.