హీరో శర్వానంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి థంసప్ యాడ్ వల్ల వెలుగులోకి వచ్చిన హీరో శర్వానంద్ చిన్న నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక సినిమాలలో నటించి మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రన్ రాజా రన్, శతమానం భవతి , గమ్యం, ప్రస్థానం, మహానుభావుడు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో పొజిషన్ కి చేరుకున్నాడు శర్వానంద్. ఇకపోతే శర్వానంద్ గురించి ఒక రూమర్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది . రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటాడు అనే వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.
ఇటీవల ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో శర్వానంద్ ని అడగగా తనదైన రీతిలో స్పందించాడు. ఇక తాను ఇప్పటివరకు నటించిన సినిమాలు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని, వారి దగ్గర ఎప్పుడూ కూడా తక్కువ తీసుకోలేదని, కానీ చిన్న నిర్మాతలు వస్తే మాత్రం కచ్చితంగా తక్కువ పారితోషకం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. హైదరాబాదులో ప్రతి ఏరియాలో మీకు స్థలాలు ఉన్నాయని.. మీరు బాగా రిచ్ అని , ఈ సిటీలో 3 వంతుల భాగం మీదే నట కదా అని ప్రశ్నించగా అందుకు శర్వానంద్ ఈ విధంగా బదిలించాడు.. శర్వానంద్ మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న బాగానే సంపాదించారు. నేనే సొంతంగా సినిమాలు తీసుకోగలిగే కెపాసిటీ మాకుంది అంటూ ఆయన వెల్లడించారుఇకపోతే శర్వానంద్ సినిమాల విషయంలో ఫ్లాప్ వచ్చినప్పుడు తన పారితోషకం తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తాము ముగ్గురు పిల్లలమని 19 ఏళ్ల వయసు వచ్చాక ఇంట్లో డబ్బులు అడగడం మానేశానని.. ప్రస్తుతం మేమంతా కూడా లైఫ్లో బాగానే సెటిల్ అయ్యామంటూ చెప్పుకొచ్చారు శర్వానంద్ . దీన్ని బట్టి చూస్తే శర్వానంద్ కొన్ని కోట్ల ఆస్తికి అధిపతి అని స్పష్టం అవుతుంది.