కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల… మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం లో కి వెళ్ళింది. ఇక ఆయన మృతి పట్ల… టాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే … తమిళ్ హీరో సూర్య… ఇవాళ అ బెంగళూరు వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే శివరాజ్ కుమార్ తో కలిసి.. ముని సమాధి వద్దకు వెళ్లారు సూర్య. అప్పు సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ఈ సందర్భంగా కొన్ని సమాధిని చూడగానే హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. సమాధి వద్ద నిల్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు హీరో సూర్య. అయితే హీరో సూర్య కన్నీళ్లు పెట్టిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
.@suriya_offl broke down emotionally while paying homage to late actor #PuneethRajkumar. pic.twitter.com/p9p27Oqm3f
— Manobala Vijayabalan (@ManobalaV) November 5, 2021