విజయ్ దేవరకొండ భారీ విరాళం…!

-

కరోనా వైరస్ పై చేసే పోరాటంలో ప్రతీ ఒక్కరు కూడా ఎవరికి వారుగా తమ వంతుగా ఏదోక సాయం చేస్తున్నారు. ఉన్న వాళ్ళు ఉన్న విధంగా చేస్తుంటే లేని వాళ్ళు లేని విధంగా సాయం చేస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అందరూ కూడా తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి.

మన తెలుగులో దాదాపు అందరు హీరోలు కూడా తమ వంతుగా సహాయం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హీరోలు హీరోయిన్ లు అందరూ కూడా సాయం చేసారు. ఎన్నో విధాలుగా ఇప్పుడు కరోనా పోరాటానికి సహాయం చేస్తున్నారు. తాజాగా మరో హీరో ప్రభుత్వానికి సహాయం చేసాడు.

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా తాను 1.3 కోట్లు విరాళం గా ఇస్తున్నట్టు ప్రకటించాడు. కరోనా వైరస్ పై పోరాటంలో ఇప్పుడు అందరికి కావాల్సింది ప్రేమ అని అన్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు విజయ్. దీనిపై పలువురు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version