నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన మాధవీలత గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో కనిపించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అప్పట్లో మాధవీలతకు ఆఫర్లు అంతగా రాలేదు. ఇక తమిళ మూవీస్‌లో ట్రై చేసినా అక్కడా వర్కోట్ కాలేదు. అలా హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన మాధవి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ బోలెడు ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మాధవీలత టాలీవుడ్‌లో జరుగుతున్న ప్రతి అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న విషయం తెలసిందే. ఇక తాజాగా మాధవీలత చేసిన పెట్టిన ఓ ఫేస్ బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది.
అందులో ఆమె తనకు అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని త్వరలోనే నేను కూడా చచ్చిపోతానని రాసింది. ఎదో ఒక రోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు తానుకూడా ఏ మందులు పనిచేయక ఒకరోజు చనిపోతానని తన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతూ ఉంటానని పేర్కొంది. ఆ సినిమాలో హీరోయిన్ వేసుకున్నట్లు తాను ప్రతీ దానికి నిత్యం ఏదో ఓక మెడిసన్స్ వేసుకుంటూ ఉంటానని తెలిపింది. ఏదో ఒక రోజు ఏ మందు పనిచేయక తాను కూడా చనిపోతానని తెలిపింది. తనకు మైగ్రేన్ తలనొప్పి,జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమె తమదైన శైలిలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు.