Esther: ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు చాలా కామన్ : టాలీవుడ్ హీరోయిన్

-

బిగ్బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్, రేప్ సింగర్ నోయల్… టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లైన ఆరు నెలలకే ఈ జంట విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. 2020 సెప్టెంబర్ నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు విడివిడిగానే ఉంటున్నారు.

కాగా ఇటీవల 69 సంస్కార్ కాలనీ అనే సినిమాలో ఎస్తేర్ నటించింది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా చాలా హాట్ కామెంట్స్ చేసింది ఎస్తేర్. “ప్రస్తుతం అక్రమ సంబంధాలు అనేది హాట్ టాపిక్ గా మారింది.

సమాజంలో జరుగుతున్న చాలా అక్రమ సంబంధాలు ని నా స్నేహితుల ద్వారా విన్నాను. కొంతమంది తమ అక్రమ సంబంధం గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం సీక్రెట్ గా పని కానిచ్చేస్తున్నారు. సమాజంలో ఇప్పుడు అక్రమ సంబంధాలు కామన్ అయిపోయాయి ” అంటూ ఎస్తేర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా 69 సంస్కార్ కాలనీ సినిమాలో కూడా ఎస్తేరు అక్రమ సంబంధం పెట్టుకునే గృహిణి క్యారెక్టర్లో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 4 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version