మూడు సార్లు బ్రేకప్ చేసుకున్నా…!

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కాస్త పరిధి దాటి మాట్లాడుతున్నారు అనే ఆరోపణలు అస్తున్నాయి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సహా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత హాట్ కామెంట్స్ చేస్తే అంత మంచి అవకాశాలు వస్తాయని వాళ్ళు భావించి ఏదొకటి మాట్లాడుతున్నారు.

తాజాగా హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ రాయ్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో ప్రస్తావించింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికి మాత్రమే పరిమితం అయిన లక్ష్మీ రాయ్ తన ప్రేమ వ్యవహారాలను అభిమానులతో పంచుకుంది. అసలు ఆమె ఏమంది అనేది చూస్తే.. అవును.. నేను గతంలో పలుసార్లు ప్రేమలో పడ్డానని చెప్పింది.

చాలా మందితో బ్రేకప్‌లు కూడా జరిగాయని ఆమె వివరించింది. మూడు సార్లు ప్రేమలో మోసపోయా అని ఆవేదన వ్యక్తం చేసింది. టీం ఇండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తో కూడా ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని ప్రచారం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆమె నిర్మాత కుమారుడు తో ప్రేమలో ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో ఆమెనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version