అల్లు అరవింద్ ప్లాన్ వర్కౌట్ అయితే మిగతా నిర్మాతలందరూ ఆయన వెనకాలే పడతారా ..?

-

బాలీవుడ్ మేకర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూఅసర్ అల్లు అరవింద్ “ఆహా” అన్న పేరుతో ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్ ఫాం లో వరసగా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు. కాని బాలీవుడ్ లో వస్తున్న వెబ్ సిరీస్ స్థాయిలో ఇక్కడ సక్సస్ అవలేదనే చెప్పాలి. అల్లు అరవింద్ కూడా భారీ బడ్జెట్స్ తో సినిమాలు నిర్మిస్తూ “ఆహా” మీద అంతగా ఆసక్తి చూపించలేదు.

 

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి. మరో రెండు, మూడు నెలల వరకు కూడా థియేటర్లు ప్రారంభమయ్యో అవకాశాలు కనిపించడం లేదు. టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో చెప్పుకోదగా వెబ్‌ సిరీస్‌లు రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అల్లు అరవింద్.‌

అందులో భాగంగా ఇప్పుడు అల్లు అరవింద్‌ “ఆహా” ని సక్సస్ ట్రాక్ లోకి తేవాలని కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. కంటెంట్‌ బావుంటే అల్లు అరవింద్‌ మంచి బడ్జెట్ కేటాయించి వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ కి కథ లని సెలెక్ట్ చేస్తున్నారట. అంతేకాదు ట్యాలెంటెడ్‌ యంగ్ డైరెక్టర్స్‌ నుండి సీనియర్ దర్శకుల వరకు అల్లు అరవింద్ మంచి ఆఫర్ ఇస్తున్నారట.‌ వెబ్ సిరీస్ తో పాటు లో బడ్జెట్ లో సినిమాలని నిర్మించి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇది గనక వర్కౌట్ అయితే టాలీవుడ్ లో ఉన్న దిల్ రాజు, సురేష్ బాబు, నాగార్జున వంటి పెద్ద నిర్మాతలనుండి అందరూ అల్లు అరవింద్ వెనకాలే ప్రయాణం చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version