‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. దర్శకుడు నెల్సన్ దిలీప్- ప్రియాంక మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.
శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ డాక్టర్ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్. ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అయినట్లు తెలుస్తున్నది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందని ప్రచారం సాగుతోంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇటు ప్రియాంక గానీ, అటు దర్శకుడు నెల్సన్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.
నెల్సన్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. ఇందులో రజనీ కాంత్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తోంది. అయితే తమన్నా కన్నా ముందే ఈ పాత్ర కోసం ప్రియాంకను అనుకున్నారట. కానీ నెల్సన్‌తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్‌కు నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని తెలిసింది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్‌మీడియాలో ఇలా వార్తలు వస్తున్నాయి. ప్రియాంక మోహన్ ప్రస్తుతం రాజేష్, జయంరవి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తున్నది.