హాయ్ నాన్న.. ఇటీవల నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సైలెంట్ హిట్ కొట్టింది.తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.అందుకే మూవీ రిలీజ్ అయి 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లకు జనాలు వస్తున్నారు. అంటే ఈ సినిమా ఆడియోన్స్ మనసులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సలార్, డంకీ వంటి పెద్ద మూవీస్ వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న హాయ్ నాన్న మూవీ ఓటీటీ విడుదల గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది.
నాని హీరో గా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అయింది.అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం హాయ్ నాన్న మూవిని జనవరి మూడో వారం లేదా నాలుగో వారంలో ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు.కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. జనవరి మొదటి వారంలోనే ఈ చిత్రం ను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నది. అంటే సినిమా విడుదలైన 28 రోజుల తర్వాత అంటే జనవరి 5 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.