భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి దాయాది దేశం సరిహద్దులోని భారత రాష్ట్రాలపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడింది. భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ రాజస్థాన్‌లోని మూడు నగరాలకు అధికారులు అత్యవసర రెడ్ అలెర్డ్ జారీ చేశారు.
బార్మర్, శ్రీగంగానగర్, జోధ్ పూర్ సిటీలలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించారు. వెంటనే ప్రజలు ఎవరింటికి వారు తిరిగి వెళ్లాలని కోరారు. బార్మర్‌లోని అన్ని మార్కెట్లను మూసివేయాలని, ప్రజలు ఇళ్లకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ టీనా దాబీ పేర్కొన్నారు. ‘ప్రజలు వెంటనే వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశిస్తున్నాం. మార్కెట్లను వ్యాపారులు మూసివేయాలి. ప్రజా కదలికలను తక్షణమే నిలిపివేయాలి’ అని జిల్లా కలెక్టర్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధకారులను ఆదేశించారు.