రివైండ్ 2024 : ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రాలివే..

-

పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేస్తుంటారు. కొంతమంది హీరోలు అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తున్నారు. తెలుగులో పెద్ద హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయిన నేపథ్యంలో వాళ్ల నుంచి సంవత్సరానికి ఒక సినిమా ఆశించడం కష్టమే అవుతుంది.

ఇలాంటి టైంలో చిన్న సినిమాలే బాక్సాఫీసును నిలబెడతాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత పెద్ద విజయం అందుకొని పెద్ద సినిమాగా మారుతాయి.

2024లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకున్న సినిమాలు ఏంటో చూద్దాం.

హనుమాన్:

ఈ లిస్టులో మొదటి పేరు హనుమాన్ ఉంటుంది. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. టోటల్ రన్ లో 290 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది హనుమాన్. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.

టిల్లు స్క్వేర్:

డీజెటిల్లు సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం మార్చ్ 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హీరో సిద్ధూ జొన్నలగడ్డకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించింది.

కమిటీ కుర్రోళ్ళు:

మెగా డాటర్ కొణిదెల నీహారిక నిర్మించిన ఈ చిత్రాన్ని యధు వంశీ డైరెక్ట్ చేశారు. సాయికుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా మొదలైన వాళ్ళు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా 90s కిడ్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

మత్తు వదలరా 2, 35 చిన్న కథ కాదు, శ్రీ విష్ణు నటించిన స్వాగ్, రావు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version