కరోనాపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ కీలక ఆదేశాలు…

-

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్ట్ లో విచారణ జరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో హైకోర్ట్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోర్ట్ సూచింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. 

దేశంలో ప్రస్తుత కరోనా కేసలు పెరుగుతున్నాయి. గతంలో రోజుకు కేవలం 10 వేల లోపే ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలను దాటింది. దీంతో పాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో వేయి లోపలే ఉండే కేసులు ప్రస్తుతం 2500ను దాటాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కూడా భేటీ అవుతోంది. రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూతో  పాటు పలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version