Breaking : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ధర్మాసనం ఎత్తివేసింది హైకోర్టు. మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరుగుతున్న సమయంలో మొయినాబాద్లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్రెడ్డి పిటిషన్లో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమమైంది. సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈకేసు విచారణ జరిపించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్పై లోతైన విచారణ కొనసాగించాల్సి అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version