తెలంగాణ సర్కార్ మీద హైకోర్టు సీరియస్

-

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 10న కోర్ట్ కు  ప్రభుత్వం ఇచ్చిన అండర్ టేకింగ్ ను నిలబెట్టుకోలేక పోయారన్న కోర్టు ప్రభుత్వం ఇచ్చిన  మ్యానువల్ లో చాలా లొసుగులు ఉన్నాయని అభిప్రాయ పడింది. స్లాట్ బుకింగ్, పిటీఇన్ నంబర్ కోసం ఆధార్ కార్డ్ నంబర్ అవసరం లేదని గతం లో కోర్ట్ కు ప్రభుత్వం స్పష్టం చేసిందని కానీ ప్రస్తుతం స్లాట్ బుకింగ్, పిటీ ఐ ఎన్ నంబర్ లో ఆధార్ అడుగుతున్నారని కోర్టు పేర్కొంది.

స్లాట్ బుకింగ్ చివర్లో సమ్మరీ ట్రాన్సాక్షన్ లో కూడా ఆధార్ అడుగుతున్నారన్న కోర్టు స్లాట్ బుకింగ్, పి టి ఐ ఎన్ నంబర్ కు ఆధార్ అడగవద్దు అని హై కోర్ట్ ఆదేశం ఇచ్చినా పి టి ఐ ఎన్ , స్లాట్ బుకింగ్ పేరు మీద ఆధార్ అడగటం సరైన పద్ధతి కాదని పేర్కొంది. అమ్మేవారు, కొనే వారు,సాక్ష్యాలను, కుటుంబ సభ్యులను ఆధార్ కార్డ్ నంబర్ అదగవద్దన్న కోర్టు అసలు ఆధార్ కార్డు నంబర్ నమోదు ను సాఫ్ట్వేర్ నుండి తొలగించమని ఆదేశించింది. వ్యక్తి వివరాల కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డ్ లను అంగీకరించవచ్చని హై కోర్టు పేర్కొంది. క్యాబినెట్ సబ్ కమిటీ ఈ అంశం పై నిర్ణయం తీసుకుంటుందని కోర్ట్ కు అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.  సవరణ కు వారం రోజులు గడువు ప్రభుత్వం కోరగా రిజిస్ట్రేషన్ లు చేస్కోండి కానీ ఆధార్ అడగవద్దని హై కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version