ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 1458 సీనియర్ ప్రెసిడెంట్ పోస్టుల నియామక నోటిఫికేషన్ ను హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. నియామక ప్రక్రియలో ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను అనుమతించలేదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణితో పాటు మరికొందరు పిటిషన్ వేశారు. ఏ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేసిన అర్హులేనని లాయర్ శ్రవణ్ వాదించారు.
దీనికి సంబంధించిన పత్రాలను న్యాయవాది కోర్టుకు అందించారు. దీంతో శ్రావణ్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.