టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల ఆ సినిమాతో ప్రేక్షకుల మనసులను దోచుకుని టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. ఇదిలా ఉండగా…. నటి శ్రీలీల డేటింగ్ లో ఉందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా రావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలా ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు చూసిన అనంతరం వీరిద్దరి మధ్య రిలేషన్ పక్క ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, కార్తీక్ – శ్రీ లీల ఇద్దరూ కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ నిజంగా వివాహం చేసుకుంటే వారి జంట ఎంతో బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.