ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడి అధికారులు ఉదయం నుంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. పలు ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ఇద్దరు న్యాయవాదులతో తెలంగాణ అడిషనల్ ఏజీ ఈడి కార్యాలయంలోనికి వెళ్లారు. ఆయనతోపాటు సోమ భరత్, గండ్ర మోహన్ రావు కూడా వెళ్లారు.
ఆ తర్వాత ఇద్దరు డాక్టర్లు సైతం ఈడీ కార్యాలయంలోనికి వెళ్లడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా హస్తినలో సీన్ మారిపోయింది. ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు వైద్య పరీక్షలు చేస్తారనే విషయం తెలిసిందే. దీంతో కవితను అరెస్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది.