వరద సహాయం 10 వేలు అందని భాదితులు ఆందోళనకు దిగారు. సీఎం క్యాంప్ ఆఫీస్ సీమపంలోని మీసేవ వద్ద 10 వేల రూపాయలు వరద సహాయం పొందని భాదితులు ఆందోళనకు దిగారు. క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు వచ్చిన భాదితులను పోలీసులు చెదరగొట్టారు. లాక్ డౌన్ లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాదితులు.
సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ నిజమైన భాదితులకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటలు నుండి మీసేవ వద్ద పడిగాపులు కాస్తున్నామని వారు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్మెంట్ కు నిరసనగా క్యాంపు ఆఫీస్ వద్ద నిరసనకు దిగడంతో వారందరినీ పోలీసులు చెదరకొట్టారు.