దశాబ్దాల వైరం తాడిపత్రిలో మళ్లీ రాజుకుందా?

-

దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పు ఒక్కసారిగా ఉప్పొంగింది… పాతికేళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది… బాంబులు పడి..నెత్తురు చిట్లి..కొడవళ్లు గాల్లోకి లేచినా అసలు నాయకులు సీన్ లోకి రాలేదు. సీమ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వెళ్లి కయ్యానికి కాలు దువ్వారు. అయితే ఇంత జరిగినా జేసీ ఎందుకు కేసు పెట్టలేదు… దాడి చేసిన వారే కేసు పెడితే ఎందుకు మౌనంగా ఉన్నారు… ఈ మౌనం వెనుక వ్యూహం ఉందా…. పోలీసు తుఫాకి నీడ లో ఉన్న తాడిపత్రి లో ఏం జరుగుతోంది…

తాడిపత్రి కేంద్రంగా దశాబ్దాలుగా అధిపత్య పోరు నడుస్తోంది.జెసి,కేతిరెడ్డి వర్గీయుల పగ ఈనాటిదీ కాదు.అయితే జెసి సోదరులు ఎక్కువ కాలంలో అధికారంలో ఉండడంతో నియోజకవర్గంలో వారిదే ప్తెచేయిగా ఉంది.అయితే 2006 లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్యకావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారి పోయింది. నియోజకవర్గంలో ఏం జరిగినా.. జెసి , కేతిరెడ్డి వర్గీయుల మధ్య అధిపత్య పోరు నడిచేది.

2019 ఎన్నికల తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.వరుస విజయాలతో అధికారంలోకి జెసి సోదరుల విజయాలకు బ్రేకు పడింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందడమే గాక.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వ్తెసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిగా ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న నియోజకవర్గంలో… బిఎస్ 4 వాహనాల కోనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి , తనయుడు ఆస్మిత రెడ్డిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. జెసి ప్రభాకర్ రెడ్డి , ఆస్మిత్ రెడ్డిలు 53 రోజులు పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.

పరిస్థితి సద్దుమణిగింది అనుకునేంతలోనే ఆడియో పోస్ట్.. జెసి ,కేతిరెడ్డి వర్గీయుల చిచ్చురేపింది. మీడియాలో జరిగే మాటల వార్ గడప దాటి ఘర్షణలకు దిగే వరకు వచ్చింది. ప్రత్యర్థి ఇంటికి వచ్చి దాడులు చేసే వరకు ఘర్షణ చెలరేగింది. అది కూడా వివాదాలకు, సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి రావడం అక్కడ ఒక వ్యక్తిపై దాడి చేయడం..ఆ తరువాత దాడులు ప్రతిదాడులతో తాడిపత్రి దద్దరిల్లింది. గత కొన్ని దశాబ్ధాలుగా సాగుతున్న ఇరువర్గాల మధ్య వైరం మరోసారి తెరపైకి వచ్చింది.

తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రమైన తాడిపత్రిలో ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.పరిస్థితి పోలీసులు అదుపులో ఉందని చెబుతున్నా టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. ఏ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version