హిమంత బిస్వా శర్మ… ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఇది. అసోం రాష్ట్రంలో బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు. ప్రస్తుత సిఎం సర్బానంద సోనోవాల్ సహా ఇతర నేతలు ఆయన పేరుని ప్రకటించారు. అయితే ఆయన నేపధ్యం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నేపధ్యమే.
2015 లో తరుణ్ గోగోయ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆయన బిజెపిలో జాయిన్ అయ్యారు. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతుగా హెల్ప్ చేసారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన కీలకంగా పని చేసిన నేపధ్యంలో సిఎం గా ఆయనను బిజెపి అధిష్టానం ప్రకటించింది. హిమంత బిస్వా శర్మ 1990 లలో కాంగ్రెస్‌లో చేరారు. హిమంత బిస్వా శర్మ 2001 లో జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వ్యవసాయ, ప్రణాళిక మరియు అభివృద్ధి, ఆర్థిక, ఆరోగ్యం, విద్య వంటి అనేక శాఖలకు మంత్రిగా చేసారు.