కరోనా వైరస్ నేపధ్యమో మానవత్వం అనేది దాదాపుగా కనపడకుండా పోయింది. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో భయపడి సాయం చేసే వాళ్ళు ముందుకి రావడం లేదు. ఇలాంటి తరుణంలో కూకటపల్లి సిఐ చేసిన సాయానికి ముఖ్యమంత్రి ఫిదా అయిపోయారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లలిత్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర అనారోగ్యం సోకింది.
లాక్ డౌన్ నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి ఎవరూ ముందుకు వచ్చి నిలబడలేదు. అతని వద్ద వైద్య౦ చేయించుకోవడానికి డబ్బులు లేవు. దీంతో ఈ విషయం కూకటపల్లి పోలీసులకు తెలిసింది. సిఐ లక్ష్మీ నారాయణ రెడ్డి వేగంగా స్పందించారు. ఇతరుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యానికి అత్యవసరంగా 20 వేలు అవసరం అయ్యాయి.
కూకట్‌పల్లి సీఐ లక్ష్మినారాయణరెడ్డి ఆ డబ్బును ఆస్పత్రికి చెల్లించారు. ఆయన చేసిన సాయం హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కి తెలిసింది. దీనిపై ఠాకూర్ కూకట్‌పల్లి సీఐని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో అండగా నిలిచే మీ వ్యక్తిత్వం పలువురికి ఆదర్శనీయమని ఆయన ప్రశంసించారు.